Thursday, April 16, 2026
HomeUncategorizedకొత్తపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేడుకల్లో పాల్గొన్న కోనసీమ...

కొత్తపేట నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వేడుకల్లో పాల్గొన్న కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి

కొత్తపేట జిల్లా వాణి ప్రతినిధి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముందుగా రావులపాలెం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ ఆవిర్భావ దినోత్సవ కేక్‌ను కట్ చేశారు. అనంతరం కొత్తపేట సెంటర్లో గల దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం కొత్తపేట గవర్నమెంట్ హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీలకు, పేషెంట్లకు వృద్ధులకు పండ్లు బ్రెడ్స్ మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. అనంతరం జగిరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పని చేస్తుందని తెలిపారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular