నక్కపల్లి,జిల్లావాణి
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పాయకరావుపేట నియోజకవర్గంలో రేపు సాయంత్రం జరగబోయే ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో నక్కపల్లి మండలంలో మంత్రి నివాసం వద్ద ఈ ఇఫ్తార్ విందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన ముస్లిం సోదరులు సుమారు వెయ్యి మంది హాజరుకానున్నారు. రంజాన్ మాసం పవిత్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఇఫ్తార్ విందు కార్యక్రమానికి హోం మంత్రి అనిత స్వయంగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు నక్కపల్లిలోని మంత్రి నివాసం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో రేపు ఇఫ్తార్ విందు
RELATED ARTICLES
