నక్కపల్లి, జిల్లావాణి
వైస్సార్ సిపి 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మండలంలో వైఎస్ఆర్ సిపి కేంద్ర కార్యాలయం వద్ద వైసిపి రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం లో జెడ్పిటిసి,సర్పంచులు, ఎంపీటీసీలు, మండలంలోని ముఖ్య నాయకులు తదితరులు సమక్షంలో ముందుగా దివంగత నేత వై.ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కటింగ్ ఘనంగా నిర్వహించారు. స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా వీసం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వైస్సార్ సిపి కార్యకర్త జగన్ మోహన్ రెడ్డిని ముఖ్య మంత్రిని చేయడానికి ఎదురు చూస్తున్నారని రాబోయేది మరల జగనన్న ప్రభుత్వమని అన్నారు. కూటమి ప్రభుత్వం లో ఎవ్వరికి ఎలాంటి పథకం పూర్తి స్థాయిలో అందడం లేదని వృద్ధులు, మహిళలు,ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జీవిస్తున్నారని అన్నారు. వీరందరికి తొందరలోనే మంచి రోజులు రానున్నాయని తెలిపారు.ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు పాల్గొన్నారు.
నక్కపల్లి లో ఘనంగా వైస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం
RELATED ARTICLES
