నక్కపల్లి, జిల్లావాణి
జనసేన పార్టీ13 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు అనేక సేవా కార్యక్రమాలు శనివారం చేపట్టారు. ఈ మేరకు ఉపాధి హామీ కార్మికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి
కురందాసు అప్పలరాజు, పంపనబోయిన తులసి రావు , చందక నానాజీ, మామిడి గణపతి, రాధాకృష్ణ ,ముల్లి శ్రీను, కొండలరావు, దేవర దుర్గాప్రసాద్, కరక నాని లు పాల్గొన్నారు.
