పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలంలోని దుసరిపాము గ్రామ పంచాయతీలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజవొమ్మంగి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు బొదిరెడ్డి త్రిమూర్తులు మరియు జన సైనికులు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు బొద్దిరెడ్డి త్రిమూర్తులు మాట్లాడుతూ జనసేన పార్టీ ఉద్యమ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన పార్టీ ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక రాజకీయాలు, యువతకు అవకాశాలు కల్పించడమే పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ తీసుకువెళ్తున్న విధానాలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల మద్దతుతో జనసేన పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు విస్తరించి ప్రజల మధ్య పనిచేయాలని కార్యకర్తలకు మండల పార్టీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. జనసేన మండల యువజన అధ్యక్షులు కొచ్చ లావరాజు జానకి దుర్గాప్రసాద్ బొదిరెడ్డి రాజు, జన సైనికులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
మన్యంలో జనసేనాని 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES
