పెందుర్తి, జిల్లావాణి ప్రతినిధి: ప్రతి ఏటా ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించుకునే ఉపవాస దీక్షలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు…ఈ దిశలో విశాఖ జిల్లా పెందుర్తి మండలం 88 వ వార్డు లోని సత్తివానిపాలెం గ్రామం అహ్మద్ నగర్ నందు మైనార్టీస్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఉత్సాహవంతంగా సాగింది.. ఈ వేడుకలకు అతిధులుగా పెందుర్తి శాసనసభ్యుడు,, ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, పంచకర్ల రమేష్ బాబు,, మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రహిమాన్ లు హాజరయ్యారు.. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ జరిగిన సభ నందు అతిథులు ప్రసంగిస్తూ,, ఉపవాస దీక్షలతో మానసిక శారీరక ఉల్లాసమే గాక,, పరోక్ష సామాజిక అభ్యున్నతి ఏర్పడతాయని పేర్కొన్నారు… తదుపరి అహ్మద్ నగర్ లో జరిగే ఇఫ్తార్ విందుకు,ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యలన్నిటిని పరిష్కరించిన అనంతరమే హాజరవుతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు… కార్యక్రమంలో స్థానిక పెద్దలు మాట్లాడుతూ,, తమ కాలనీ అభ్యున్నతికి అహర్నిశలు సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యేని కొనియాడారు… ఈ సందర్భంగా అతిథులను వారి సాంప్రదాయానుసారం ఘనంగా సత్కరించారు… ఈ కార్యక్రమంలోమాజీ కార్పొరేటర్ రఫీ,, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు దిలీప్,,ప్రవీణ్,, స్థానిక నాయకులు ఇందల రమణ,,ఎల్లపు శ్రీను,,గల్లా శ్రీనివాసరావు,,ఓమ్మి సత్యం,,మైనారిటీస్ డెవలమెంట్ సొసైటీ అధ్యక్షుడు హాజీనూర్ అహ్మద్,,, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సుభాన్,,,ఉపాధ్యక్షుడు జిలాని బ్యాగ్,,,కార్యదర్శులు,,దివాంజి,, షేక్ సిలర్,,, కార్యనిర్వహక కార్యదర్శులు మహమ్మద్ అరిఫ్,,, ఫారుకి,,,కోశాధికారి ఎన్ ఇస్లాం,,, మరియు సొసైటీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు,, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు
ఇఫ్తార్ విందులో పాల్గొన్న పెందుర్తి MLA పంచకర్ల రమేష్ బాబు
RELATED ARTICLES
