Thursday, April 16, 2026
HomeUncategorizedఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధాన్ని వ్యతిరేకించండి,సిపిఎం

ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధాన్ని వ్యతిరేకించండి,సిపిఎం

అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని, యుద్ధం వద్దు శాంతి కావాలని అచ్యుతాపురం సంతలో సిపిఎం కరపత్రాలు పంపిణీ చేసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం అచ్చుతాపురం కన్వీనర్ ఆర్ రాము ,సీనియర్ నాయకులు కరీ అప్పారావు మాట్లాడుతూ
గత 22 రోజులుగా ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ కలిపి ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా ఇతర నగరాలపై బాంబుల వర్షం కురిపించాయి ఆ దేశంలో పాఠశాల పై బాంబులు వేసి 160మంది విద్యార్థులకు బలి తీసుకున్నాయి నేవీ ఉత్సవాల్లో పాల్గొనడానికి మన విశాఖ తీరానికి వచ్చిన నూక తిరిగి వెళుతున్న శ్రీలంక సముద్ర జలాల్లో పయనిస్తున్న సైనిక పడవను 100 మంది ని అమెరికా నీటముంచింది వేలాల మంది నేటికీ చనిపోతున్నారు యుద్ధము వలన అమెరికా ఖనిజ నిక్షేపాలపై పెత్తనం చలాయించడం కోసం ఇజ్రాయిల్ తో కలిపి దాడులు పూనుకుంటున్నది దీంతో భారత దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి ఇప్పటికే వంట గ్యాస్ ధరలు పెరిగాయి వంటగ్యాసు దొరకగా ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు దీంతోపాటు నిత్యవసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి గ్యాస్ ఉత్పత్తి లేక పరిశ్రమల్లో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు తోపుడు బళ్ళు, చిరు వ్యాపారస్తులు గ్యాస్ లేక ఉపాధి కోల్పోతున్నారు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మన దేశ ఎగుమతులు ఆగిపోయాయి ఎగుమతులు చేసే వస్తువులు ధరలు తగ్గి రైతాంగం పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి దిగుమతి చేసుకునే ఆయిల్ ,గ్యాస్ ఇతర వస్తువులు అమాంతం ధరలు పెరుగుతున్నాయి యుద్ధం నివారణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు పైగా అమెరికా ,ఇజ్రాయులకు వత్తాసు పడుతున్నాయి మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోతుంది యుద్ధ నివారణకు చర్యలు తీసుకొని యుద్ధాన్ని వ్యతిరేకించి శాంతిని నెలకొల్పాలని సిపిఎం కోరుతున్నది ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కె సోము నాయుడు,ఆర్ లక్ష్మి ,కడారి అప్పారావు కాసులమ్మ, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular