జగ్గంపేట, మార్చి 20, (జిల్లా వాణి ప్రతినిధి):జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం జగ్గంపేట మండల కేంద్రంలో సివిల్ సప్లైస్ మరియు విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా హోటళ్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ సిలిండర్లకు బదులుగా గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లను వాడుతున్న ఐదు హోటళ్లపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సివిల్ సప్లైస్ డిప్యూటీ తహశీల్దార్ మరియు విజిలెన్స్ అధికారుల బృందం జగ్గంపేటలోని పలు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో మొత్తం 9 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ సమోసా సెంటర్ (మెయిన్ రోడ్): 1 సిలిండర్, అమృత డాబా అండ్ ఫ్యామిలీ రెస్టారెంట్ : 3 సిలిండర్లు,కనకదుర్గ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ 1 సిలిండర్, లక్ష్మీ గణపతి బెంగళూరు బేకరీ 1 సిలిండర్, లక్ష్మీ నరసింహ పొలైట్ రెస్టారెంట్: 3 సిలిండర్లుప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి, సబ్సిడీపై వచ్చే గృహ వినియోగ సిలిండర్లను వ్యాపార అవసరాలకు వాడుతున్న సదరు హోటల్ యజమానులపై సివిల్ సప్లై చట్టం 1955, సెక్షన్ 6A కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.”ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు. గృహ వినియోగ సిలిండర్లను వ్యాపారాలకు వాడటం చట్టరీత్యా నేరం.” అని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ తనిఖీల్లో విజిలెన్స్ సీఐ కె. నాగ వెంకట రాజు, సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్ జి.ఎం.ఎం. కృష్ణ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్ అధికారి శ్రీరామ్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

