అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం వెలంక్కాయలపాలెం గ్రామంలో పరా సంవత్సరోత్సవాలను పురస్కరించుకుని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బావ చదువుతున్న విద్యార్థులకు ఆటల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ యూత్ లీడర్ సిరాల సూర్యచంద్ర ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలు విజయవంతంగా పూర్తి చేశారు. పోటీల్లో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, వివిధ ఆటల్లో పోటీపడ్డారు. గెలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో జనసేన యువకులు మణికంఠ, బెజవాడ వాసు తదితరులు, గ్రామ జనసేన కార్యకర్తలు, వీరమహిళలు, స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఉత్సవాలు మరింత ఆకర్షణీయంగా మార్చిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
పరభావ నామ సంవత్సర ఉత్సవాల్లో భాగంగా వెలంకాయల పాలెం పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు.
RELATED ARTICLES
