Thursday, April 16, 2026
HomeUncategorizedస్టీల్ ప్లాంట్ కు భూములు ఇచ్చిన రైతులకు కనీస గౌరవం ఎక్కడ

స్టీల్ ప్లాంట్ కు భూములు ఇచ్చిన రైతులకు కనీస గౌరవం ఎక్కడ

నక్కపల్లి, జిల్లావాణి
పాయకరావుపేట నియోజకవర్గం లో అభివృద్ధి కి భూములు త్యాగం చేసిన రైతులకు కూటమి నాయకులు కనీస గౌరవం ఇవ్వకపోవడం దారుణమని
వైసిపి రాష్ట్ర కార్యదర్శి, విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిశీలకులు, వీసం రామకృష్ణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు. ఈ సందర్బంగా
మండలం లోని ఆర్సెలాల్ మిట్టల్ -నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు సంబందించి భూములు ఇచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని కనీసం వారికి తగిన ఆహ్వానం కూడా పూర్తి స్థాయిలో రాలేదని ఆవేదన చెందారు.ఈ మేరకు మండల కేంద్రం లో గల వైసిపి కేంద్ర కార్యాలయం లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అంటే స్వర్గీయ వై ఎస్ రాజశేఖరరెడ్డి అని తర్వాత ఆయన వారసుడు జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. గతం లోను టిడిపి అధికారం లో ఉందని పాయకరావుపేట నియోజకవర్గం ఎంతమేర అభివృద్ధి అయిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు. మా నాయకులను దూసిస్తే సహించేదన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని హెచ్చరించారు.అన్ని మేమే అంత మాదే అనడం విడ్డూరం గా ఉందన్నారు.గతంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి గా ఉన్నప్పుడు దావోస్ పర్యటన లో అనేక పర్యాయలు మిట్టల్ స్టీల్ వారిని కలవడమే కాకుండా కావాల్సిన భూములు కూడా చూపించి ఆహ్వానం పలికి కోట్లాది రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు తీసుకోని వచ్చారని ఇప్పుడు కూటమి నాయకులు ఒక్క జూమ్ కాల్ తోనే మొత్తం తాము చెప్తేనే అయిపొయిందని చెప్పడం చాలా హాస్యా స్పదం అన్నారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు మండల ఉపాధ్యక్షులు,వెలగ ఈశ్వరావు,బీసీ నాయకులు,ఎల్లేటి సత్యనారాయణ, తళ్ల భార్గవ్, గొర్ల గోవింద్,మాజీ ఎంపిటిసి పిక్కి తాతారావు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular