Thursday, April 16, 2026
HomeAndhra Pradeshమాజీ ఎమ్మెల్యే ఉదారత, ఈదురుగాలూల ధాటికి నష్టం వాటిల్లిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

మాజీ ఎమ్మెల్యే ఉదారత, ఈదురుగాలూల ధాటికి నష్టం వాటిల్లిన బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలం లోని కొండలింగంపర్తి గ్రామానికి చెందిన జుర్రా కుమారి, బుడమ శ్యాం మూర్తి కుటుంబాలవారి ఇంటి పైకప్పు ఇటివలే కురిసిన భారీ వర్షం ఈదురుగాలూల ధాటి ప్రభావం వల్ల ఇంటి పై కప్పులు ఎగిరిపోయి నష్టం వాటిల్లడంతో విషయం తెలుసుకున్న రంప మాజీ ఎమ్మెల్యే వైసీపీ ఇంచార్జి నాగులపల్లి ధనలక్ష్మి ఆర్థిక సాయంగా రూ. 5 వేలు నగదు, 25కిలోలు బియ్యం అందజేశారు. ఇదే క్రమంలో వంచంగి గ్రామానికి చెందిన బుడమ శ్యామ్మూర్తి కుటుంబానికి రూ 10 వేలు నగదు, 25 కిలోలు బియ్యాన్ని పార్టీ శ్రేణులుతో కలిసి మంగళవారం అందించారు. అంతేకాకుండా వంచంగి గ్రామంలో పింఛన్ రాని పలువురుకి ఒకొక్కరికి రూ. 1,000లు, పాపకు రూ. 1000లు, పక్షవాతంతో ఉన్న ఒక్కరికి రూ. 2 వేలు నగదు సహాయాన్ని అందించారు. అంతేకాకుండా గ్రామాల్లోనీ యువత చెడు మార్గాలవైపు వెళ్లకుండా మానసిక ఉల్లాసానికి అనువుగా సన్మార్గంలో ఉండాలని ఆకాంక్షిస్తూ జడ్డంగి కొమరాపురం ఓకుర్తి వాతంగి కొండ లింగంపర్తి వంచంగి మారేడుబాక గ్రామాల్లో వాలీబాల్ కిట్లను ఉచితంగా అందించారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, వైస్ ఎంపీపీ జుర్రా రాజేశ్వరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ ఈకా లక్ష్మి పార్వతి, మండల వైసీపీ కన్వీనర్ సింగిరెడ్డి రామకృష్ణ, సర్పంచ్లు తొంటా ఆదిరాజు కించు వెంకటలక్ష్మి కొంగర మురళీకృష్ణ సవిరాల చంద్రుడు, దాసరి నాగేశ్వరరావు ఎంపీటీసీ కనిగిరి గంగా దుర్గా వైసీపీ శ్రేణులు జుర్రా జాన్ బాబు కనిగిరి దుర్గాప్రసాద్ దాట్ల వెంకటేష్ రాజు దూరిపల్లి రత్నరాజు కోపూరి ఈశ్వరరావు అడపా కామేశ్వరరావు సింగిరెడ్డి రవి కుంట్రు అర్జున్ మంపా నరసింహ సప్పా శ్రీను దొంగర శ్రీను ఆధ్య రమేష్ కొప్పిశెట్టి దుర్గబాబు. కోసూరి చిన్నాలమ్మ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular