పురస్కారాలు ప్రతిభకు మరింత పదును పెడతాయని.. కళాకారులకు మరింత ప్రోత్సాహంగా నిలుస్తాయని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రం లో విశాఖ జిల్లా కళాకారులు సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన కళా ప్రవీణ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ దేశ సంస్కృతి, ఖ్యాతిని కళాకారులు చాటిచెబుతున్నారన్నారు. ప్రతి సంవత్సరం కళాకారులను గుర్తించి వారిని సత్కరించుకోవడం అభినందనీయం అన్నారు.. విశాఖకళాకారుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు.. జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ జిల్లాలో కళాకారులు అంతర్జాతీయ ప్రదర్శనలు ఇస్తూ మన దేశానికి రాష్ట్రానికి మరింత గుర్తింపును తీసుకువస్తున్నారన్నారు. ఇటువంటి కళాకారులను గుర్తించి ప్రోత్సహించడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఇంతవరకు 400 మందికి పైగా ప్రతిభావంతులైన జిల్లా కళాకారులకు అవార్డులతో ప్రోత్సహించడం జరిగిందన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి మాధవి మాట్లాడుతూ పర్యాటక ప్రగతిలో కళాకారులు పాత్ర ప్రశంసనీయమైనదన్నారు. ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ ఉత్సవాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తున్నామన్నారు. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖలో కళా నైపుణ్యం కు తగ్గట్టు వేదికలు లేవన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆడిటోరియం విశాఖలో అవసరమన్నారు. సంఘం అధ్యక్షుడు క్యాలు జనార్దన్, ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీ య విశ్వవిద్యాలయం మీడియా వభాగం ప్రతినిధి బి.కే. రామేశ్వరి,అంతర్జాతీయ కొరియోగ్రాఫర్, సీనియర్ జర్నలిస్ట్ ఆర్.నాగరాజు పట్నాయక్, సినీ దర్శకులు యాద్ కుమార్,యువ సంగీత దర్శకుడు మనోహర్ ప్రసాద్, నంది అవార్డు శివజ్యోతి, సత్కీర్తి క్రియేషన్స్ అధినేత ఆర్. గణేష్, అంతర్జాతీయ నృత్యోత్సవాల నిర్వాకుడు కన్నం రమణారావు,వ్యాఖ్యత మమత తదితరులు పాల్గొన్నారు ఈ సoదర్భంగా రామ్మోహన్ మిమిక్రి, జోషిత, జి. డింపుల్, ఆర్.హెచ్. టీనా, బి. గీతిక, విష్ణు ప్రియ లు చేసిన బహుభాషా నృత్యాలు, కళా రాధన, సిరి డాన్స్ ఇన్స్టిట్యూట్ కళాకారుల శాస్త్రీయ నృత్యాలు, ఇతేష్ సాయి, జానకి లు ఆలపించిన గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం 15 మంది కళాకారులకు అతిథులు చేతుల మీదుగా కళా ప్రవీణ పురస్కారాలు ప్రధానం చేశారు.. అభిమానులు కళాకారులతో ప్రాంగణం సందడిగా మారింది
అంగరంగ వైభవంగాకళా ప్రవీణ పురస్కారాలు ప్రధానము
RELATED ARTICLES
