యస్. రాయవరం.జిల్లావాణి
మండలంలోని 28 గ్రామ పంచాయతీలలో అమలు జరుగుతున్న ఇంటి పన్నులు వసూలు ప్రక్రియను డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఇ. నాగ లక్ష్మీ గురువారం సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల చివరి నాటికి తప్పనిసరిగా ప్రతీ పంచాయతీలో శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని దీనిపై ప్రజలు సకాలంలో పన్నులు చెల్లించి ప్రభుత్వానికి సహకరించి తద్వారా గ్రామాభివృద్ధికి పాటు పడాలని అన్నారు.ఇంటి పన్నులు చెల్లించేందుకు ఎవరైనా గృహ యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత గృహ యజమానులకు తక్షణమే ఫైనల్ నోటీసులు ఇవ్వాలని ఇచ్చిన నోటీసులుకు కూడా వారు స్పందించకపోతే ఏపీ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఆస్తుల జప్తుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీ సిబ్బందికి డివిజనల్ డెవలప్మెంట్ అధికారి ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపిడిఓ బంగారు సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి నాగప్రభు,సచివాలయం సిబ్బంది,గ్రామ పెద్దలు నవీన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
సకాలంలో ప్రతి పంచాయతీలోను శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
RELATED ARTICLES
