నక్కపల్లి, జిల్లావాణి
మండల కేంద్రం లో మెగా అభిమానులు ఆధ్వర్యంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు ముందుగా రామ్ చరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగా అభిమానులు మీగడ సత్య నారాయణ మూర్తి, వెలగ సుధాకర్, కర్రి నానాజీ, ముద్దా బాబ్జి, కోసూరు శ్రీనువాసరావు తదితరులు సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించి స్వీట్స్ పంచారు.అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో నటులు ఎన్నోకష్టాలు అనుభవించారని వారిలో కొందరు మాత్రమే ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని అలానే మెగాస్టార్ చిరంజీవి కూడా సాధారణ స్థాయి నుండి మకుటంలేని మహారాజు స్థాయికి ఎదిగి ఎందరికో బాట వేశారని అలాంటి మెగాస్టార్ వారసుడు గా సినీ పరిశ్రమ కు వచ్చి తండ్రి బాటలోనే కష్టపడి తారాస్థాయికి చేరుకోవడం రామ్ చరణ్ క్రమశిక్షణ కు ఇదే నిదర్శనం అన్నారు.ఈ సందర్బంగా రామ్ చరణ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మెగా అభిమానులు పాల్గొన్నారు.
నక్కపల్లి లో ఘనంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES
