Thursday, April 16, 2026
HomeUncategorizedప్రధానమంత్రి నిర్ణయాలు పేద, మధ్య తరగతి ప్రజలకు భరోసాలు

ప్రధానమంత్రి నిర్ణయాలు పేద, మధ్య తరగతి ప్రజలకు భరోసాలు

నక్కపల్లి, జిల్లావాణి

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న ఎలాంటి సాసోపేతమైన నిర్ణయాలైన పేద, మధ్యతరగతి వారికీ భరోసా కల్పించి వారికి న్యాయం జరిగేలా ఉంటాయని దీనికి మనమందరం హర్షించదగ్గ విషయం అని బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు కోసూరి శ్రీనివాసరావు తెలిపారు.ఈ మేరకు శుక్రవారం మండల బిజెపి కార్యాలయం వద్ద శ్రీనివాసరావు మాట్లాడుతూ పెట్రోలు డీజిల్ పై ప్రధాని నరేంద్ర మోదీ సుంకాలను తగ్గించి పేద, మధ్యతరగతి ప్రజలపై భారం పడకుండా నిర్ణయం తీసుకోవడం భారతదేశం గర్వించదగ్గ విషయమని ఇటువంటి విపత్కర యుద్ధ సమయంలో అనేక దేశాలు ఆయిల్ పై రేట్లు పెంచాయాని అలాగే మరి కొన్ని దేశాలలో సరఫరా కూడా చేయలేని స్థితిలో ఉన్నాయని ఇటువంటి సమయంలో కూడా యావత్తు ప్రపంచం మెచ్చుకునేలా మన నాయకుడు భారతదేశ ప్రధాని మధ్యతరగతి ప్రజలు పై భారం పడకూడదనే ఆలోచనతో సుంకాలను తగ్గించారన్నారు.
ప్రభుత్వంపై ఎంత భారం పడినా మధ్యతరగతి ప్రజలపై ఆభారాన్ని మోపకుండా వారికి లబ్ది చేకూరాలనే ఆలోచనతో రేట్లు తగ్గించడం
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు.సమర్థత గల నాయకుడు దేశానికీ ప్రధాని అయితే ఫలితాలు కూడా ఎంతో మంచి జరిగేలా ఉంటాయని మరోసారి రుజువయిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోలినాటి నానాజీ, బీజేపీ సీనియర్ నాయకులు కొల్నాటి అప్పారావు, నున్న జ్యోతిబసు, బంగారి శివ,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular