నక్కపల్లి, జిల్లావాణి
మండలం లోని ఆదివారం హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటిస్తారని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని పాయకరావుపేట నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ తెలిపారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకుంటూ కార్యకర్తల నుండి ముఖ్య నాయకులు వరకు మండలంలోని బోధిగల్లం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొనే కార్యక్రమానికి తరలి రావాలని పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని అన్నారు.నియోజవర్గంలో ప్రతి గ్రామం నుండి నాయకులు, కార్యకర్తలు,సర్పంచులు,గ్రామశాఖ అధ్యక్షులు, బూత్ ఇంచార్జులు, ఎంపీటీసీలు, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.
