జల్లావాని ప్రతినిధి నర్సీపట్నం.
నర్సీపట్నం డిపోలో పదవ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు.
కార్మికులను ఇబ్బంది పెడుతున్న డిపో మేనేజర్ ధీరజ్.
నర్సీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ ధీరజ్ తీరుకు నిరసనగా నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ కార్మికులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరాయి. శుక్రవారం ఉదయం ఎన్. ఎం. యు. ఏ.రాష్ట్ర నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి, మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డిపో కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పది రోజులుగా రిలే దీక్షలు చేపట్టినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులుకె.వి.ఆర్.నర్సింగరావు, జోనల్ సెక్రెటరీ బి.ఎస్. రాములు, జోనల్ అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, స్టేట్ పబ్లిసిటీ సెక్రటరీ జి.ఎస్. రావు, నర్సీపట్నం డిపో సెక్రటరీ ఆర్. వి. రమణ, జిల్లా అధ్యక్షుడు ఆర్.ఎన్.రాజు మరియు డిపో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

