Saturday, June 6, 2026
HomeUncategorizedమధ్యాహ్నం భోజనం పథకంప్రైవేట్ చేయొద్దని సిఐటియుడిమాండ్

మధ్యాహ్నం భోజనం పథకంప్రైవేట్ చేయొద్దని సిఐటియుడిమాండ్

అనకాపల్లి జిల్లా
అచ్చుతాపురం మండలం లో మధ్యాహ్నం భోజన పథకాన్ని స్మార్ట్ కిచెన్ ల పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలు విరమించుకోవాలని ఎంఈఓ ఆఫీస్ వద్ద ధర్నా చేసి ఎంఈఓ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది సి ఐ టి యు మండల కన్వీనర్ కూండ్రపు సోమునాయుడు మాట్లాడుతూ
మధ్యాహ్నం భోజన పథకం కార్మికులు అతి తక్కువ గౌరీ వేతనంతో పేద పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లో గత 23 సంవత్సరాలుగా వండి పెడుతున్న మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులను పొట్ట కొట్టి ప్రైవేట్ సంస్థలకు అప్పగించే విధానం మానుకోవాలి
ఈ మధ్యాహ్నం భోజనం పథకాన్ని కేంద్ర బిజెపి రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు స్మార్ట్ కిచెన్ పేరుతో ఒకే చోట వండి స్కూలుకు పంపాలని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు చాలాకపోయినా సమయానికి బిల్లులు రాకపోయినా అప్పులు చేసి పిల్లలకి వండి పెట్టాలని వేడివేడిగా ఆహారం అందిస్తున్నారు సంవత్సరాల గడిచిన జీతాలు పెరగలేదు అయినా మధ్యాహ్నం భోజనం పథకాన్ని నిర్వహిస్తున్నారు కేంద్రం లో బిజెపి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు మధ్యాహ్నం భోజనం పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని ప్రైవేట్ పరం చేయాలని ప్రతి మండలంలో స్మార్ట్ కిచెన్ చేయాలని నిర్ణయించింది అక్షయపాత్ర నవ ప్రవేశ ఇస్కాన్ వంటి సంస్థలకు స్కూల్ పిల్లలకు పోషకాహారం కలిగించే స్కూల్లో మధ్యాహ్నం భోజనం పథకం ఉండడంవల్ల పిల్లల సంఖ్య పెరుగుతుంది డ్రాపోర్ట్స్ తగ్గితాయని బాలికల్లో చదువుకున్న వారి సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వమే చెబుతుంది అటువంటి పేదలకు విద్యార్థులకు విద్యను దూరం చేయాలని చూస్తుంది స్మార్ట్ కిచెన్లు వ్యతిరేకిస్తూ అచ్చుతాపురం ఎంఈఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం భోజనం పథకం కార్మికులు సత్యవతి,వరలక్ష్మి, కృష్ణవేణి, కొండమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular