Thursday, April 16, 2026
HomeUncategorizedఅనకాపల్లి జిల్లాకు తక్షణమే ముగ్గురు తూర్పుకాపు డైరెక్టర్లను నియమించాలి:తూర్పుకాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కరణం...

అనకాపల్లి జిల్లాకు తక్షణమే ముగ్గురు తూర్పుకాపు డైరెక్టర్లను నియమించాలి:తూర్పుకాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కరణం శ్రీహరి (లాయరు) డిమాండ్

యలమంచిలి (ఏప్రిల్ 8): అనకాపల్లి జిల్లా లో అత్యధిక జనాభా ఉన్న తూర్పుకాపులకు రాష్ట్ర తూర్పుకాపు డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కనీసం ముగ్గురు తూర్పుకాపు డైరెక్టర్ల ను తక్షణమే నియమించాలని, తూర్పుకాపు సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కరణం శ్రీహరి(లాయరు) డిమాండ్ చేశారు. బుధవారం యలమంచిలి లో జరిగిన జిల్లా తూర్పుకాపు కోర్ కమిటీ సమావేశానికి, తూర్పుకాపు సంక్షేమ సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కరణం శ్రీహరి(లాయరు) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరణం శ్రీహరి (లాయరు) మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గంల్లో యలమంచిలి,అనకాపల్లి,చోడవరం, పాయకరావుపేట,పెందుర్తి ఈ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంఖ్యాపరంగా తూర్పుకాపులు మొదటి స్థానంలో ఉన్నారని, మిగిలిన నర్సీపట్నం, మాడుగుల ఈ రెండు నియోజకవర్గాల్లో సంఖ్యా పరంగా తూర్పుకాపులు రెండో స్థానంలో ఉన్నారని వెల్లడించారు. కావున అనకాపల్లి జిల్లాకు కనీసం ముగ్గురు తూర్పుకాపు డైరెక్టర్లను తక్షణమే నియమించాలని కరణం శ్రీహరి(లాయరు) డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం అనకాపల్లి జిల్లా నుండి రాష్ట్ర తూర్పుకాపు డెవలప్మెంట్ కార్పొరేషన్ కు డైరెక్టర్ గా గొల్లవిల్లి ప్రభావతి సంజీవరావును నియమించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా తూర్పుకాపు కోర్ కమిటీ సభ్యులు అడపా శేషగిరిరావు(మాస్టర్), సిరిగిరిశెట్టి నానాజీ, వెలంశెట్టి శ్రీనివాసరావు , నక్కా శివశంకరరావు,ఇన్నం రమణ,అన్నం స్వరాజ్యరావు, అందే రమణ, పోలిన సూర్య జగ్గారావు, బలిరెడ్డి సూరిబాబు,ఆకుల వెంకటేష్, శెన్నంశెట్టి రామునాయుడు, ఆది గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular