
ఎలమంచిలి: అనకాపల్లి జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎన్నికలు ఎలమంచిలి శ్రీ సత్య కాంప్లెక్స్ లో శుక్రవారం నాడు ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా ఛైర్మన్ సూర్యనారాయణ , ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధి జి.పవన్ ,ఏ.పీ.ఎఫ్.ఏ కోఆర్డినేటర్ శ్రీ నీలాద్రి సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు. జిల్లా గౌరవ ఛైర్మన్‌గా లాలం చందు , అధ్యక్షుడిగా గణేష్ , వైస్‌ప్రెసిడెంట్ గా చల్లా సుస్మిత , కార్యదర్శిగా బోదెపు భవాని , సంయుక్త కార్యదర్శి గా రుద్రపంతి నరేష్ , కోశాధికారిగా మోహన్ రావుగ, సభ్యులుగా జి.భాగ్యరేఖ , కె.శేషగిరి ,ఆర్.నరేంద్ర తోపాటు కో ఆప్షన్ సభ్యులుగా బోదెపు రామకృష్ణ ఏ.బి.ఎల్.రాజు,పిల్లా రాము నేషనల్ స్పోర్ట్స్ కోటా ద్వారా ఎన్నుకున్నారు. దీనికి శ్రీ ఎన్.సత్యన్నారాయణ ఎన్నికల పర్యవేక్షకులుగా వ్యవహరించారు.ఎన్నికల అనంతరం సుస్మిత గారు క్రీడాకారులకు షూస్ మరియు డ్రెస్సెస్ ఇవ్వడం జరిగింది.
