అనకాపల్లి జిల్లా కూసర్లపూడి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ క్యాంపెయిన్ నిర్వహించారు. హెచ్ఎం శెట్టి మోహనరావు, ఉపాధ్యాయ బృందంతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ, మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను జెడ్పీ హైస్కూలులో చేర్పించేందుకు తల్లిదండ్రులను ఆహ్వానించారు.ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న పాఠ్య పుస్తకాలు, వసతి, వసతిదిన పథకాలు, యూనిఫాంలు, డిజిటల్ లెర్నింగ్ వంటి సేవల గురించి టీచర్లు తల్లిదండ్రులకు వివరించారు. దీంతో గ్రామంలోని చాలామంది పాఠశాలపై విశ్వాసం వ్యక్తం చేస్తూ తమ పిల్లలను చేర్పించేందుకు ముందుకు వచ్చారు.
ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఆశించిన దానికంటే మంచి స్పందనను రాబట్టడంతో పాఠశాల సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.
కుశర్లపూడి జడ్పీ హైస్కూల్లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఇంటింటా ప్రసారంతో తల్లిదండ్రుల్లో స్పందన.
RELATED ARTICLES
