Thursday, April 16, 2026
HomeUncategorizedవిద్యతోనే సామాజిక వికాసం సాధ్యం: మహాత్మా పూలే జయంతి వేడుకల్లో డా. రంగారావు

విద్యతోనే సామాజిక వికాసం సాధ్యం: మహాత్మా పూలే జయంతి వేడుకల్లో డా. రంగారావు

జగ్గంపేట, ఏప్రిల్ 11: “విద్య లేక ఆలోచనా శక్తిని, ఆలోచన లేక మంచి ప్రవర్తనను, తద్వారా అభివృద్ధిని, సంపదను కోల్పోయి సమాజంలో అట్టడుగు వర్గాలు వెనుకబడిపోయాయి. ఈ అనర్థాలన్నింటికీ అవిద్యే ప్రధాన కారణం” అని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ టి.వి.ఎస్. రంగారావు అన్నారు. శనివారం జగ్గంపేట ప్రభుత్వ పాఠశాల ఆవరణలోని పరివర్తన స్థలంలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం రంగారావు మాట్లాడుతూ కీలక ఉపన్యాసం చేశారు. విద్యారంగంలో తొలి అడుగులుభారతదేశంలో విద్యారంగంపై స్వదేశీయులు చేసిన మొదటి ప్రయత్నం పూలేదేనని ఆయన కొనియాడారు. జనవరి 1848: బాలికల కోసం మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు. మే 15: పూనాలోని మహర్ వాడలో రెండవ పాఠశాలను ప్రారంభించారు.అజ్ఞానం, కుల భాషా భేదాలే ఈ దేశపు భయంకరమైన రోగాలని గుర్తించిన పూలే, సమాజంలో అత్యంత అణచివేతకు గురైన మహర్, మాంగ్ వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేశారని వివరించారు.సావిత్రిబాయి పూలే స్ఫూర్తిఅప్పట్లో మహిళలకు చదువు అందని ద్రాక్షగా ఉన్న తరుణంలో, పూలే తన భార్య సావిత్రిబాయి పూలేను ఇంట్లోనే చదివించి, ఆమెను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన వైనం నేటికీ ఆదర్శనీయమని రంగారావు పేర్కొన్నారు. మనిషి గౌరవంగా బతకాలంటే విద్యను అర్జించడం అత్యవసరమని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు దాడి బాబురావు, డి. పద్మావతి, ఎం.కె. కళ్యాణ చక్రవర్తి, చిన్న, వరప్రసాద్, బంగారయ్య, ఎం. విజయలక్ష్మి, జి. కనకదుర్గ, వాణి, చిన్న పాప, గంగ భవాని, సత్య ఉమాలక్ష్మి, స్వరూప మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular