Wednesday, April 22, 2026
HomeUncategorizedఅనకాపల్లి జిల్లా యలమంచిలి వేద పాఠశాలలో గోశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సుందరపు...

అనకాపల్లి జిల్లా యలమంచిలి వేద పాఠశాలలో గోశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

స్థానిక గౌడ జోగమాంబ స్మారక వేద పాఠశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బుధవారం ఉదయం ఇక్కడ నూతనంగా నిర్మించ తలపెట్టిన గోశాల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ భూమి పూజ నిర్వహించి శ్రీకారం చుట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా కొబ్బరికాయ కొట్టి ఆయన పనులను ప్రారంభించారు. గో సంరక్షణ మన సంస్కృతిలో భాగమని, వేద విద్యను అభ్యసించే విద్యార్థుల సమక్షంలో గోశాల ఏర్పాటు కావడం ఎంతో శుభప్రదమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గో సేవను బాధ్యతగా తీసుకోవాలని, ఈ గోశాల భవిష్యత్తులో ఉత్తమ సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ గోపీనాథ్, బొద్ధపు శ్రీను, ఊటకూటి రమేష్ నాయుడు, కొటారి శ్రీనివాస్ మరియు పాఠశాల గౌరవ అధ్యక్షులు సోమేశ్వరరావు, అధ్యక్షులు వీర,సెక్రటరీ పెద్దింటి మూర్తి, రాచకొండ శ్రీను, భాగవతుల సాయి, ఆనివెళ్ల శ్రీనివాస్, ఆకొండి సాయి, కాలనాధభట్ల వెంకటేష్ తో పాటు కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై గోశాల నిర్మాణానికి తమ మద్దతు ప్రకటించారు. భూమి పూజ పూర్తయిన అనంతరం వేద పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనం అందజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular