జగ్గంపేట, ఏప్రిల్ 30: పదవ తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన శరకణం భవ్యశ్రీ నేహా ధాత్రి అద్భుత ప్రతిభ కనబరిచింది. శశి వేలివెన్ను పాఠశాలలో విద్యనభ్యసించిన ఈమె, 600 మార్కులకు గాను 592 మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. వైసిపి నాయకుడు శరకణం అచ్చిరాజు కుమార్తె అయిన భవ్యశ్రీ, మొదటి నుండి చదువులో ఎంతో చురుకుగా ఉండేది. క్రమశిక్షణతో కూడిన నిరంతర కృషి, పట్టుదలే తన ఈ విజయానికి మూలమని ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తన కుమార్తె సాధించిన విజయం పట్ల తండ్రి అచ్చిరాజు మరియు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భావి డాక్టర్‌గా సేవ చేయడమే లక్ష్యం తన భవిష్యత్తు లక్ష్యాల గురించి భవ్యశ్రీ మాట్లాడుతూ…”చదువులో నాకు ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు. భవిష్యత్తులో డాక్టర్‌గా మారి సమాజానికి, ముఖ్యంగా పేదవారికి సేవ చేయడమే నా జీవిత ఆశయం. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత కష్టపడి చదువుతాను.” అని ధీమా వ్యక్తం చేసింది.అభినందనల జల్లుగ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చిన భవ్యశ్రీ ని గ్రామస్తులు, ఉపాధ్యాయులు మరియు పలువురు ప్రముఖులు అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

