పిఠాపురం నియోజకవర్గంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ బాధ్యతల నుంచి అధిష్ఠానం తప్పించింది. ఈ నిర్ణయం స్థానిక రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు త్వరలోనే ఒక ప్రత్యేక కమిటీని నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీ ఏర్పాటుపై టీడీపీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది.ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ పిఠాపురంలోని పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనను ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంపై స్పందిస్తూ, కన్నీళ్లు ఆపుకోలేక ప్రెస్ మీట్ మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. అంతకుముందు వర్మ మాట్లాడుతూ.. పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకే పనిచేశానని, పార్టీ బలోపేతం కోసమే కృషి చేశానని, ఎన్నడూ వ్యతిరేకంగా పనిచేయలేదని అన్నారు. పిఠాపురంలో ఎన్డీయే కూటమిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే, పార్టీ వ్యవహారాల నిర్వహణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని తానే స్వయంగా మంత్రి నారా లోకేశ్‌ను కోరినట్లు వర్మ సంచలన విషయం వెల్లడించారు.
పిఠాపురం టీడీపీలో అనూహ్య పరిణామం..బాధ్యతల నుంచి వర్మ తొలగింపు.
RELATED ARTICLES
