Friday, June 5, 2026
HomeUncategorizedతామరాడ బ్రిడ్జి వద్ద ప్రయాణికుల కోసం రేకుల షెడ్ ఏర్పాటు: ప్రారంభించిన తుమ్మలపల్లి రమేష్

తామరాడ బ్రిడ్జి వద్ద ప్రయాణికుల కోసం రేకుల షెడ్ ఏర్పాటు: ప్రారంభించిన తుమ్మలపల్లి రమేష్

– ఎండల తీవ్రత దృష్ట్యా మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

కిర్లంపూడి, మే 11:కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని కిర్లంపూడి మండలం తామరాడ బ్రిడ్జి వద్ద ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ మానవత్వాన్ని చాటుకున్నారు. తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రయాణికుల షెడ్, మజ్జిగ చలివేంద్రాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ప్రజల కోరిక మేరకు సౌకర్యాల కల్పనతామరాడ బ్రిడ్జి వద్ద బస్సుల కోసం వేచి ఉండే పాలెం, గోనేడ, సోమవరం, తామరాడ, రామచంద్రపురం గ్రామాల ప్రజలు ఎండ వానల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గతంలో ట్రస్ట్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన తుమ్మలపల్లి రమేష్, సొంత ఖర్చుతో అక్కడ ప్రయాణికుల కోసం రేకుల షెడ్ నిర్మించారు. ఎండల దృష్ట్యా చలివేంద్రంప్రస్తుతం ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు షెడ్ వద్దే చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన చోట సేవ చేయడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, వేసవిలో ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు సర్పంచ్ తుమ్మలపల్లి సాయి గుణశేఖర్, తామరాడ ఎంపీటీసీ గోకేడ రాజా, రామచంద్రపురం ఎంపీటీసీ బండారు ప్రసాద్‌తో పాటు బండారు చక్రధర్, గోకేడ ప్రసాద్, రేవూరి శ్రీను, కొలమూరు బుజ్జి, భద్ర, గంధం వెంకన్న, దొడ్డి శ్రీను, సత్తిబాబు, అబ్బాయి, గోకేడ పండు, కనపర్తి జాషువా తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.తమ ఇబ్బందులను గుర్తించి షెడ్ ఏర్పాటు చేసినందుకు స్థానిక గ్రామస్తులు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ తుమ్మలపల్లి రమేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular