అనకాపల్లి జిల్లా కోటవురట్ల శివాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తి పరవశంతో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 108 మంది భక్తులతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణం 13 సార్లు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ముందుగా హోమం నిర్వహించి, అనంతరం హనుమాన్ పూజ చేసి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం గురు స్వాములకు ఘన సన్మానం చేశారు. అలాగే ఇంటర్మీడియట్‌లో మండల ఫస్ట్ సాధించిన స్వాతి, పదో తరగతిలో మండల ఫస్ట్ సాధించిన యశస్విని లను కూడా సన్మానించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ సి.వి. రాజు హాజరయ్యారు. అలాగే శ్రీ సీతారామరాజు, విశ్వహిందూ పరిషత్ దుర్గా వాహిని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి శోభారాణి, ఛత్రపతి శివాజీ హిందూ సేన కమిటీ అధ్యక్షుడు నక్క సత్యనారాయణ, కార్యదర్శి తేజ, కమిటీ సభ్యులు, బ్రహ్మశర్మ తదితరులు పాల్గొన్నారు.ఈ వేడుకలు భక్తి శ్రద్ధలతో సాగి, ప్రాంతీయ భక్తులను ఆకట్టుకున్నాయి.
కోటఉరట్లలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.
RELATED ARTICLES
