Friday, June 5, 2026
HomeUncategorizedహైవేపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: 18 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

హైవేపై ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు: 18 బ్లాక్ స్పాట్ల గుర్తింపు

గండేపల్లి: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వెల్లడించారు. గురువారం గండేపల్లి పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించిన అనంతరం, జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ తో కలిసి ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బ్లాక్ స్పాట్ల గుర్తింపు జగ్గంపేట నియోజకవర్గ పరిధిలోని 16వ నంబర్ జాతీయ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న 18 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. వీటి వద్ద రక్షణ చర్యల కోసం హైవే అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు ఐజీ తెలిపారు. రహదారి విస్తరణ త్వరలోనే హైవే విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయని, దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తొలగి ప్రమాదాలు తగ్గుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పుష్కరాల ప్రణాళిక వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా భారీ భద్రతా ఏర్పాట్లు చేయనున్నారు. రాజమహేంద్రవరం నగరంలోకి కేవలం భక్తులను, వారి వాహనాలను మాత్రమే అనుమతిస్తామని, మిగిలిన వాహనాలను దారి మళ్లిస్తామని స్పష్టం చేశారు. నేర నియంత్రణ – నిఘా నేరాల అదుపునకు సాంకేతికతను జోడిస్తున్నట్లు ఐజీ పేర్కొన్నారు. రేంజ్ పరిధిలోని ఆరు జిల్లాల్లో ఇప్పటికే 25 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. పాత నేరస్తులపై నిఘా ఉంచడంతో పాటు విగ్రహాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాం.హైవే పెట్రోలింగ్ర హదారిపై నిరంతరం పర్యవేక్షణ కోసం కొత్త పెట్రోలింగ్ వాహనాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. బాల్య వివాహాల నిరోధం బాల్య వివాహాలను కఠినంగా అడ్డుకుంటామని హెచ్చరించారు.”ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. స్వీయ రక్షణే ప్రాణాలకు రక్ష.” – ఐజీ అశోక్ కుమార్ఈ కార్యక్రమంలో పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్, జగ్గంపేట సీఐ బి.తిరుపతి, ఎస్సైలు శివ నాగబాబు, రఘునాథరావు, సతీష్ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular