జగ్గంపేట-గొల్లలగుంట ప్రధాన రహదారిపై పోలీసులు బుధవారం ముమ్మర వాహన తనిఖీలు చేపట్టారు. జగ్గంపేట సిఐ బి. తిరుపతిరావు, ఎస్ఐ రఘునందన్ రావు తమ సిబ్బందితో కలిసి రోడ్డుపై వెళ్తున్న పలు వాహనాలను ఆపి నిశితంగా పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా తమ వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా సిఐ తిరుపతిరావు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలు వాహనదారులకు జరిమానాలు విధించారు. ఈ తనిఖీల్లో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

