Friday, June 12, 2026
HomeUncategorizedఉపాధి శ్రామికులతో ముఖాముఖి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన పీవిఎస్ ఎన్ రాజు.

ఉపాధి శ్రామికులతో ముఖాముఖి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన పీవిఎస్ ఎన్ రాజు.

రోలుగుంట, జూన్ 10: చోడవరం నియోజకవర్గానికి చెందిన రోలుగుంట మండలం కొంతలం గ్రామంలో జనసేన పార్టీ కార్యకలాపాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. జనసేన పార్టీ సేనగణం సభ్యునిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా చోడవరం నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ పి.వి.ఎస్.ఎన్. రాజును గ్రామస్తులు ఘనంగా అభినందించారు.ఈ సందర్భంగా ఆయన కొంతలం గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న ప్రదేశాన్ని సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న ఉపాధి శ్రామికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, ఎండ తీవ్రతలో వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రామికుల యోగక్షేమాలపై ప్రత్యేకంగా చర్చించి, వారికి అవసరమైన సహాయంపై హామీ ఇచ్చారు.తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో శ్రామికులకు స్వయంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ చర్యకు శ్రామికులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొంతలం గ్రామానికి చెందిన ముఖ్య నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular