Friday, June 12, 2026
HomeAndhra Pradeshనష్టంవాటిల్లిన పాత్రికేయుడికి యూనియన్ సభ్యులు ఆర్థిక సాయం

నష్టంవాటిల్లిన పాత్రికేయుడికి యూనియన్ సభ్యులు ఆర్థిక సాయం

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రంపచోడవరం డివిజన్ రాజవొమ్మంగి మండల ఓ దిన పత్రిక విలేకరి అయిన కరాసు శ్రీనివాస్‌కు చెందిన ఎలక్ట్రికల్ సర్వీసింగ్ చెందిన దుకాణం ప్రమాదవశాత్తు జరిగిన విద్యుత్ ఘాతుగానికి మంటలు వ్యాపించి పూర్తిగా ధ్వంసం అయింది. ఈ ఘటనలో షాపులోని ఉన్న ఎలక్ట్రికల్ సామగ్రి పూర్తిగా అగ్నిలో కాళీ బూడిదయయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఏపీయూడబ్ల్యూజే పోలవరం జిల్లా యూనియన్ సభ్యులు మానవతా దృక్పథంతో స్పందించి బాధిత పాత్రికేయుడు కరాసు శ్రీనివాస్‌కు తమ వంతు ఆర్థిక సహాయాన్ని ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి బియ్యాల సత్యనారాయణమూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు అడప వీరబాబు, జిల్లా ఉపాధ్యక్షులు పువ్వాడ బాలనారాయణ, పీడీవీ ప్రసన్నకుమార్, మడకం ఉదయ శ్రీనివాస్, ఎం. మహేష్ చేతుల మీదుగా యూనియన్ తరఫున రూ.10,000 నగదు సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కష్టకాలంలో పాత్రికేయ కుటుంబానికి అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా శ్రీనివాస్‌కు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు యూనియన్ సిద్ధంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరి ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు, తూపాటి వీర్రాజు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అరిపాక సూరిబాబు, ఉదయభాను, సోమిరెడ్డి రాజు, సత్తిబాబు, లక్ష్మణ్ తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular