అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి పి.వి.ఎస్.ఎన్ రాజు బుధవారం రోలుగుంట మండలం కొంతలం, వడ్డిప గ్రామాలతో పాటు రావికమతం మండలం కొత్తకోటలో ‘మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’ (ఎంఎన్‌ఆర్‌ఈజీఎస్) కింద పనిచేస్తున్న శ్రామికులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.వ్యవసాయ నీటి చెరువుల వద్ద పని చేస్తున్న సుమారు 700మంది శ్రామికులను నేరుగా కలిసిన రాజు, వారికి ఈ పథకం ద్వారా అందుతున్న ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శ్రామికులను సక్రమంగా చూసుకోవాలని, వారికి రావలసిన వేతనాలను సమయానికి చెల్లించాలని వీఆర్పీలకు సూచించారు.ఈ సందర్భంగా శ్రామికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆరు రోజుల పని చేయించుకుని 5–10 రోజుల ఆలస్యంగా వేతనాలు చెల్లించడం, తక్కువ వేతనాలు ఇవ్వడం, కొంతమందికి జాబ్ కార్డులు ఇవ్వకపోవడం వంటి అంశాలను ప్రస్తావించారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజు సంబంధిత అధికారులకు సూచించారు.శ్రామికులు తమ సమస్యలు వినేందుకు వచ్చిన రాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానికంగా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరారు.**ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా**శ్రామికుల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని రాజు హామీ ఇచ్చారు. చోడవరం ప్రాంత గ్రామీణ ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరచడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.ఈ కార్యక్రమం అనంతరం శ్రామికులకు మజ్జిగ, బిస్కెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్థానిక నాయకులు సోమిరెడ్డి బాబ్జీ, కేసరపూడి శివాజీ, బుంగా కోటి బాబు, చుక్కల శ్రీను, పెనుగొండ నానాజీలను రాజు అభినందించారు.ఈ కార్యక్రమంలో రావికమతం మండల పార్టీ అధ్యక్షుడు మైచర్ల నాయుడు, ప్రధాన కార్యదర్శి బంటు రామానాయుడు, సీనియర్ నాయకులు గట్రెడ్డు సాయినాథ్, భీమారతి జయశంకర్, గొంప చంటి, పెద్దాడ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి శ్రామికులతో పివిఎస్ ఎన్ రాజు మాట మంతి. సమస్యలు వివరించిన కార్మికులు ప్రభుత్వం దృష్టికి తీసుకె తీసుకెళ్తానని హామీ.
RELATED ARTICLES
