జగ్గంపేట(జిల్లా వాణి ప్రతినిధి) విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు, వారి సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి విలువల కూడిన విద్య ఎంతో అవసరమని, అది జగ్గంపేటలోని శ్రీ స్వామి వివేకానంద విద్యాసంస్థలతోనే సాధ్యమని పలువురు వక్తలు కొనియాడారు. శనివారం జగ్గంపేట స్థానిక వివేకానంద విద్యాసంస్థల ప్రాంగణంలో సంస్థ అధినేత ఒమ్మి రఘురామ్ ఆధ్వర్యంలో 18వ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.ఘనంగా ప్రారంభం – ఘన నివాళులు కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించిన అనంతరం, సంస్థ వ్యవస్థాపక చైర్మన్ స్వర్గీయ ఒమ్మి నూకరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా రిటైర్డ్ టీచర్ ఎం.వి. రమణమూర్తి, నూజిల్ల సూరిబాబు, జడ్పీటీసీ ఒమ్మి బిందుమాధవి హాజరయ్యారు. ముఖ్య అతిథిగా సందేశం ఎం.వి. రమణమూర్తి మాట్లాడుతూ “విద్యార్థుల ప్రధాన కర్తవ్యం చదువు. చదువుతో పాటు వినయం, విధేయత, దేశభక్తిని అలవరుచుకోవాలి. వివేకానంద సంస్థ విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తోంది.” నూజిల్ల సూరిబాబు “విలువల కూడిన విద్యను అందించడం అభినందనీయం. తల్లిదండ్రుల ఆకాంక్ష మేరకు పిల్లలను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఈ సంస్థ ముందుంది. ఇలాంటి విద్యాసంస్థలను ప్రోత్సహించడం సమాజ బాధ్యత.” ఒమ్మి రఘురామ్ సంస్థ ప్రిన్సిపాల్ మరియు కరెస్పాండెంట్ ఒమ్మి రఘురామ్ మాట్లాడుతూ.. గత 18 ఏళ్లుగా వేలమందిని ఇంజనీర్లుగా, డాక్టర్లుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దామని గర్వంగా ప్రకటించారు. తమది విద్యా వ్యాపారం కాదని, ఒక విద్యా వ్యాసంగమని స్పష్టం చేశారు. కొత్తగా ప్రారంభించిన ‘కిడ్స్ ఆర్ కిడ్స్’ విభాగానికి వస్తున్న స్పందన పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మేనేజింగ్ డైరెక్టర్ ఒమ్మి లక్ష్మీ తేజస్వి వార్షిక నివేదికను సమర్పిస్తూ, ఈ ఏడాది పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్ బాయ్స్ మరియు గర్ల్స్ విభాగాలు విడివిడిగా నిర్వహిస్తామని వెల్లడించారు. విద్యార్థులు సేకరించిన వివిధ దేశాల నాణేల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్టులు ప్రతిభను చాటాయి. దేశభక్తి గీతాలు, స్కిట్స్ మరియు నృత్య ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. వార్షిక క్రీడల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంస్థ హెడ్ మిస్ట్రెస్ పాలిన్ కురియన్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





