Thursday, April 16, 2026
HomeUncategorizedయలమంచిలి సబ్ జైలు సందర్శించిన జిల్లా న్యాయ శాఖ అధికారి…ఆర్ . సన్యాసినాయుడు

యలమంచిలి సబ్ జైలు సందర్శించిన జిల్లా న్యాయ శాఖ అధికారి…ఆర్ . సన్యాసినాయుడు

ఎలమంచిలి మండలం లో
యలమంచిలి పట్టణంలోని సబ్ జైలు ను న్యాయశాఖ అధికారి బుధవారం సందర్శించారు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాదర్శి ఆర్ సన్యాసినాయుడు ఆధ్వర్యంలో న్యాయ అవగాహనా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖైదీలను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే వారికీ ప్రభుత్వ వకీలను కేటాయించి బెయిలు పెట్టిస్తాం అని చెప్పారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, జైల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయో అని చెప్పండి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా డా విజయ్ కూమర్ ప్రిజన్ డాక్టర్ హాజరయ్యి సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు , అలాగే క్షయ రోగ వ్యాధి నిపుణులు కూడా జైలు ముద్దాయిలను సందర్శించి వారికి అవగాహన దీనితోపాటు కల్పించారు.మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహించడం జరిగినది బాలికలను ఉద్దేశించి బాలికలు బాగా చదువుకోవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడా ని కి ఒక గోల్ అనేది పెట్టుకోవాలని బాలికల ఉద్దేశించి తెలియజేశారు మరియు ప్రిన్సిపల్ జి వి విజయలక్ష్మి బాలికల ఉద్దేశించి బాలి బాలికలు బాగా చదువుకోవాలని ఇంటికి స్కూల్ కి మంచి పేరు తేవాలని పేర్కొన్నది దీనితోపాటు గురుకుల పాఠశాల వంట శాలను కూడా పరిశీలించారు భోజనం వసతులు గురించి ఆరా తీసి మెనూ ప్రకారం పెడుతున్నారా లేదా అని ఆరా తీశారు దీనిలో భాగంగా పాల్గొన్నవారు సబ్ జైలు హెడ్ వార్డెన్ పి సుబ్బారావు, ప్రిజన్ లీగల్ ఎయిడ్ లాయర్లు పివి రమణ, హరి శంకర్ రావు, ప్యానెల్ లాయర్ టి. నూకరాజు , పారా లీగల్ వాలంటీర్ కోసూరు చిరంజీవి, ఎం. వి. వి. ఎల్ కుమారి, స్కూలు ఉపాధ్యాయులు ,జైలు సిబ్బంది, న్యాయ సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular