16 2.2025 నుండి నిరవధిక సమ్మె లోనికి సహకార ఉద్యోగులు వెళ్లడం జరిగింది. ఈ సమ్మె ఈరోజు 9వ రోజుకు చేరుకుంది .దీనిలో భాగంగా ఈరోజు ఎలమంచిలి డిసిసిబి వద్ద నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమకు citu జిల్లా కార్యదర్శి ఆర్ రాము, రైతు సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు మాట్లాడి మద్దతు తెలిపారు .అనకాపల్లి జిల్లా విశాఖ కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయిస్ ఉద్యోగుల యూనియన్ రాయివరపు శివరామకృష్ణ మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా రైతులకు ప్రాథమిక స్థాయిలో ఎరువులు ,విత్తనాలు ,సకాలంలో అందేలా సహకార ఉద్యోగులకు సేవలు అందించారు.2019మార్చిలో జీవో నెంబర్ 36 విడుదల చేయడం చేసినా నేటికి ప్రభుత్వాలు సదర జీవో ను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయి. అయితే దేవుడు వరమిచ్చిన పూజారి వరము ఇవ్వని చందంగా అధికారులు జీవో ను అమలుచేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. జీవో నెంబర్ 36ను, లాభనష్టాలతో సంబంధం లేకుండా పిఎసిఎస్ ఉద్యోగులకు తక్షణమే అమలు చేసి ప్రొసీడింగ్స్ ఇవ్వవలెను. 36 జీవోలో పేర్కొన్న విధంగా డిస్ట్రిక్ట్ లెవెల్ సపోర్ట్ ఫండ్ ఆప్కాబ్. మరియు డిసిసిబి వారు రిలీజ్ చేయవలెను
2019 సంవత్సరం తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరును పర్మినెంట్ చేయవలెను. పదవి విరమణ వయసు 62 సంవత్సరంలకు పెంచవలెను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా గ్రాడ్యుటీ సహకారు ఉద్యోగులకు కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. కావున సదర్ గ్రాడ్యుటి చట్టప్రకారం అమలు చేయవలెను. ఉద్యోగులకు టర్మ్ ఇన్సూరెన్స్ 20 లక్షల రూపాయలు చేయవలెను. డివిడెంట్ రైతులకు తక్షణమే రిలీజ్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ ప్రధాన కార్యదర్శి గొంప రమణ, జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు మద్దల లోవ రాజు, పి నాగభూషణం, కే శ్రీనివాస్, వై ప్రసాద్, ఎం ఎల్ నాయుడు, సుంకర రవి, రాజన్న శంకర్రావు వీరితో పాటుగా ఎలమంచిలి, నక్కపల్లి ,అచ్యుతాపురం, అడ్డరోడ్డు, పాయకరావుపేట, కోటవురట్ల, పరిధిలో గల అన్ని పిఎసిఎస్ బ్రాంచ్ ఉద్యోగులు పాల్గొనడం జరిగింది.

