పోలవరం జిల్లావాణి ప్రతినిధి : రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు పిలుపు మేరకు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి వర్కర్ల సమస్యలు పరిష్కారం కొరకు 2వ రోజు ప్రాజెక్టు స్థాయి రిలే నిరాహార దీక్షలను అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పోలవరం జిల్లా ప్రధాన కార్యదర్శి బి నిర్మల మంగళవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా దీక్షలని ఉద్దేశించి నిర్మల, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిరామరాజు,జిల్లా నాయకులు కె వెంకటలక్ష్మి,మండల నాయకుడు సిహెచ్ కుమారిలు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయ మైన డిమాండ్ల సాధనకై ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందన్నారు. ఏళ్ల తరబడి చాలీసాలని వేతనాలతో అంగన్వాడి వర్కర్లు పనిచేస్తున్నారని,అధిక పని భారం వల్ల పూట గడవని పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల ప్రకారంగా నెలకు రూ 26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటి చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికై ప్రాజెక్టు స్థాయి చేపట్టిన రిలే దీక్షలు సందర్భంగా అంగనవాడి బడులకు అంతరాయం కలగకుండా అంగనవాడి ఆయాలతో కలిసి విధులు నిర్వహిస్తూ రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారని తెలిపారు.ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని,నిరాహార దీక్షల సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూనియన్ నాయకులు కుమారి సత్యవతి మేరీ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక చట్టాల ప్రకారం అంగన్వాడిలకు నెలకు రూ26 వేలు కనీస వేతనంగా ఇవ్వాలని డిమాండ్
RELATED ARTICLES
