Thursday, April 16, 2026
HomeUncategorizedచోడవరం పట్టణంలో పలువురు జనసేన పార్టీలోకి చేరిక.

చోడవరం పట్టణంలో పలువురు జనసేన పార్టీలోకి చేరిక.

చోడవరం పట్టణంలో పలువురు జనసేన పార్టీలోకి చేరికలు. చోడవరం పట్టణం నుండి పలువురు ఈరోజు జనసేన పార్టీ లో జాయిన్ అయ్యారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి పివిఎస్ఎన్ రాజు చేతుల మీదుగా పార్టీ కండువాలు కలుపుకొని జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు.సీనియర్ నాయకులు శ్రీ సింగంపల్లి రమేష్ , చోడవరం గ్రామపంచాయతీ 9వ వార్డు మెంబర్ శ్రీ పొట్నూరు పెద అప్పారావు, శ్రీ మంగా శ్రీ రంగా , తమటపు సత్యనారాయణ, మరియు గాంధీ గ్రామం నుండి మహిళా నాయకురాలు శ్రీమతి కొమ్మోజు ప్రశాంతి జాయిన్ అయ్యారు.వీరందరినీ రాజు పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ విధివిధానాలకి , పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేసి చోడవరం ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్లడానికి ప్రజలకు మరింత మెరుగైన సేవ చేయడానికి పనిచేయాలని అన్నారు, జాయిన్ అయిన వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పరిపాలన విధానానికి తాము ఆకర్షతులం అయ్యి జనసేన పార్టీలో జాయిన్ అయ్యామని , పార్టీని పటిష్టం చేయడానికి అలాగే తమ ప్రాంతాలకు ప్రజలకు మెరుగైన సేవలందించడానికి పనిచేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో చోడవరం పట్టణ అధ్యక్షులు కర్రి రమేష్, చోడవరం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అల్లం మాధవి రామ అప్పారావు, మండల పార్టీ అధ్యక్షులు గునూరు మూలునాయుడు, చోడవరం పట్టణ వీర మహిళా అధ్యక్షురాలు నరవ సరోజిని, రాయపురాజు పేట పిఎసిఎస్ డైరక్టర్ టి మహేష్, పార్టీ సీనియర్ నాయకులు గూనురు సూర్యనారాయణ పీలా మహేష్, దాడి వెంకట అప్పారావు, ఆడారి రమణ మాలి నాయుడు, గంజి శంకర్,సియ్యాద్రి జగదీష్ ,యల్లపు ప్రశాంత్ , యల్లపు సురేష్ పుటిక రామ కృష్ణ, ముద్దుర్తిగణేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular