Thursday, April 16, 2026
HomeUncategorizedపోలియో లేని భారతదేశం గా చూడాలని అవగాహన సైకిల్ యాత్ర.

పోలియో లేని భారతదేశం గా చూడాలని అవగాహన సైకిల్ యాత్ర.

కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి

పోలియోలేని భారతదేశముగా చూడాలని ప్రజలలో అవగాహన కల్పించడానికి సైకిల్ యాత్ర చేస్తున్నామని రోటరీ 3020 సంస్థ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు ఉన్న రోటరీ గవర్నమెంట్ ఏరియా లో ఇచ్చాపురం నుండి ప్రజలలో పోలియో నిర్మూలన కోసము అవగాహన కల్పిస్తూ సైక్లియాత్ర ప్రారంభించి నేడు కోటనందూరు విచ్చేసిన సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మీడియాతో మాట్లాడుతూ 1985లో పోలియో నిర్మూలన కోసము రోటరీ సంస్థ ప్రామిస్ చేసిందని, అప్పటినుండి పోలియో చుక్కలు చిన్న పిల్లలకు వేస్తూ ఉందని ప్రపంచంలో 99.9% తగ్గిందని, భారతదేశంలో 2014లో పోలియో రహిత భారత్ గా ప్రకటించబడిందని తెలియజేశారు. ఈ వ్యాధి తగ్గింది కదా అని నిర్లక్ష్యం చేస్తే ఇతర దేశాల నుండి మన దేశానికి వ్యాపించి సంవత్సరానికి 2 లక్షల మంది పోలియో వ్యాధి బారినపడే అవకాశం ఉందని, 100% పూర్తిగా తగ్గేవరకు పోలియోపై అవగాహన కల్పిస్తున్నామని ఇచ్చాపురం నుండి విజయవాడ వరకు వెయ్యి కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి, నిధులు సేకరిస్తూ పోలియోపై అవగాహన కల్పిస్తున్నామని, ఇప్పటివరకు 500 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపాల్ రాజు, పి మల్లికార్జునరావు, బాబి, పల్లా రామకృష్ణ, నందిక లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular