Saturday, June 6, 2026
HomeUncategorized*చంద్రగ్రహణం నేపథ్యంలో వాడపల్లి వెంకన్న ఆలయం మూసివేత*

*చంద్రగ్రహణం నేపథ్యంలో వాడపల్లి వెంకన్న ఆలయం మూసివేత*

ఆత్రేయపురం కోనసీమ జిల్లా ప్రతినిధి

కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం, వాడపల్లిలో ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా ఆలయ ద్వారాలు ఉదయం 9 గంటలకు మూసివేశారు. గ్రహణ సమయాల్లో ఆగమ శాస్త్ర నియమాలను అనుసరించి నిత్యకైంకర్యాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిలిపివేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ ముదునూరి వెంకటరాజు,(గబ్బర్ సింగ్ రాజు) ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్ రావు, ఆలయ అర్చకులు తెలిపారు.గ్రహణం ముగిసిన అనంతరం 04-03-2026, బుధవారం ఉదయం ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. సంప్రోక్షణ పూర్తయ్యిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి.గ్రహణ వేళల్లో భక్తులు ఆలయానికి రాకుండా సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular