రావులపాలెంలో అక్షర ఆంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అక్షరాస్యత ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు స్థానిక విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామస్థులు, మహిళలు పాల్గొని అక్షరాస్యత ప్రాముఖ్యతను వివరించారు. నిరక్షరాస్యత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. పెద్దలకు అక్షరాస్యత తరగతులు నిర్వహించాల్సిన అవసరాన్ని వక్తలు ప్రస్తావించారు.
అక్షరాస్యతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని, ప్రతి కుటుంబంలో కనీస విద్యాభ్యాసం ఉండాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఈకార్యక్రమం యానిమేటర్ కావేరి తదితరులు పాల్గొన్నారు.
రావులపాలెంలో అక్షర ఆంధ్ర కార్యక్రమం
RELATED ARTICLES
