Thursday, April 16, 2026
HomeUncategorizedకూటమి ప్రభుత్వంలో యువనాయకులకు తగిన ప్రాధాన్యత

కూటమి ప్రభుత్వంలో యువనాయకులకు తగిన ప్రాధాన్యత

నక్కపల్లి, జిల్లావాణి

కూటమి ప్రభుత్వంతోనే కార్యకర్తలకు, యువతకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని టిడిపి యువ నాయకులు అయినంపూడి రామకృష్ణంరాజు అన్నారు. ఈ మేరకు
మండల తెలుగుదేశం పార్టీ యువజన విభాగం అధ్యక్షులుగా వేంపాడు గ్రామానికి చెందిన కమ్మేళ్ల శివరామకృష్ణంరాజును పార్టీ ఎంపిక చేసిన సందర్బంగా గ్రామానికి చెందిన యువకులు సోమవారం జరిగిన కార్యక్రమంలో అయినంపూడి రామకృష్ణంరాజు ఆధ్వర్యంలో శివరామ కృష్ణం రాజును ఘనంగా సత్కరించారు.అనంతరం స్వీట్స్ పంచి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన శివరామకృష్ణంరాజు మాట్లాడుతూ రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఆదేశాలు మేరకు పాయకరావుపేట నియోజకవర్గ టిడిపి కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ నాయకత్వంలో మండల స్థాయిలో ఇటువంటి గొప్ప అవకాశం కల్పించడం అదృష్టం గా భావిస్తున్నానని ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ టిడిపిలో యువతను చైతన్య వంతులను చేసి పార్టీ బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. పార్టీ లో ఉన్నత స్థానం కల్పించిన నియోజకవర్గ ఆడపడుచు అభివృద్ధి ప్రదాత నిత్యం ప్రజలు శ్రేయస్సు కోరే రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో పాటు కొప్పిశెట్టి వెంకటేష్, పార్టీ అధ్యక్షులు గింజల లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు అయినంపూడి అప్పలరాజు, టిడిపి నాయకులు విజయబాబు రాజు, సుధా బ్రదర్స్, వేంపాడు గ్రామ టిడిపి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పేరిచర్ల సత్యనారాయణ రాజు, అయినంపూడి విజయ, కె.వి.ఎస్.ఎన్.రాజు, సన్నీ, సతీష్, శివ, సురేంద్ర వర్మ, కృష్ణ, హర్ష, హరీష్ వర్మ, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular