
గొలుగొండ మండలం ఏ ఎల్ పురం రైతు మార్కెట్ ని సందర్శించిన నర్సీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ,రైతులకు టమాట గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్న రైతులకు భరోసా కల్పించే విధంగా గిట్టుబాటు ధర కల్పించేందుకు మరియు టమోటా నేలపాలు కాకుండా చేసేందుకు నర్సీపట్నం,విశాఖపట్నం హోటళ్లు,మార్కెట్ వారితో మాట్లాడి టమాట నేలపాలు కాకుండా వారికి పంపిస్తానని రైతులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ సలాదులు ప్రసాద్ బాబు దేవి, డైరెక్టర్ ఎక్కల కమలాంబిక, రైతులు తదితరులు పాల్గొన్నారు
