పోలవరం జిల్లావాణి ప్రతినిధి: గత వైసిపి ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటో కలిగి ఉన్న భూమీ తాలూకా పట్టదారు పాసు పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత “మీ భూమి -మీ హక్కు” పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కలిగిన శాశ్వత రాజముద్ర భూ పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాజవొమ్మంగి రెవెన్యూ తహసీల్దార్ ఆదేశాల మేరకు మారేడుబాక గ్రామ పంచాయతీ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శాంతకుమారి విఆర్ఓ సీతారపు నానాజీ నేతృత్వంలో జీ.శరభవరం గ్రామంలో బుధవారం ఉదయం రైతుల భూములకు చెందిన నూతన పట్టాదారు పాసుపుస్తకములను ఎంపీపీ గోము వెంకటలక్ష్మి స్థానిక
సర్పంచ్ ఆదిరాజు, రాజవొమ్మంగి మాజీ జడ్పీటీసీ కోసూరి బుజ్జిచిన్నాలమ్మ సంయుక్త ఆధ్వర్యంలో 16 మంది రైతులకు చెందిన భూ పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీసా కమిటీ సెక్రటరీ కోసూరి వీరబాబు మరియు తెలుగుయువత నాయకులు కించి వెంకటరమణరెడ్డి కోసూరి లోవ వీరవెంకటరెడ్డి బోడోజు వీరభద్రరావు సాయి తదితరులు పాల్గొన్నారు.
రైతులకు శాశ్వత రాజముద్ర కలిగిన భూమీ పట్టాలు పంపిణీ
RELATED ARTICLES
