రావులపాలెం కోనసీమ జిల్లా ప్రతినిధి
స్టంట్ మెన్‌గా వెళ్ళి హీరోగా రాణిస్తున్న డాక్టర్ బీఅర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల గ్రామానికి చెందిన అభిలాష్ సుంకర హీరోగా మరో సినిమా శుక్రవారం విడుదలవుతుంది.ఈయన మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ సాధించడంతో పాటు మార్షల్ ఆర్ట్స్,జిమ్నాస్టిక్స్‌లలో ఎంతో ప్రావీణ్యం సంపాదించారు.హైదరాబాద్‌లో స్టంట్ యూనియన్ సభ్యుడిగా చేరి సుమారు 400కు పైగా చిత్రాల్లో స్టంట్ కళాకారుడిగా పనిచేసి అపార అనుభవం సంపాదించాడు. యాక్షన్ సన్నివేశాల్లో అతని ధైర్యం, నైపుణ్యం దర్శక నిర్మాతల ప్రశంసలు అందుకుంది.కన్నడ చిత్ర పరిశ్రమలో ''నన్ను హడు నన్ను దో'' నటించిన అభిలాష్ తెలుగులో "సిన్స్ 1975","గోదావరి ప్రేమ కథలు" , 'పగ పగ పగ', "సిల్లంగి" సినిమాల్లో హీరోగా నటించారు. "కాక్రోచ్" సినిమా ద్వారా మరోసారి తన ప్రతిభను చాటుకోబోతున్నారు.
