కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి
కా కినాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ బిందు మాధవ్, IPS ఆదేశాల మేరకు, కోటనందూరు పోలీస్ స్టేషన్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ HC-2499 కె. రమేష్ హెడ్ కానిస్టేబుల్ పదవి నుండి అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) పదవికి పదోన్నతి పొందిన సందర్భంగా గురువారం కోటనందూరు పోలీస్ స్టేషన్‌లో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో కోటనందూరు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ. టి. రామకృష్ణ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది కలిసి హెడ్ కానిస్టేబుల్ కె. రమేష్ అభినందిస్తూ శాలువాతో సన్మానించారు.
అదేవిధంగా తుని రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. చెన్నకేశవరావు కూడా రమేష్ అభినందిస్తూ, ఆయన పోలీస్ శాఖలో మరింత కృషి చేసి మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది అందరూ కలిసి రమేష్ కి శుభాకాంక్షలు తెలియజేశారు.
