Saturday, April 18, 2026
HomeUncategorizedజనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్చార్జ్ రాజన...

జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్చార్జ్ రాజన సూర్యచంద్ర.

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి కొణదెల పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్, బీసీ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రాజాన వీరసూర్యచంద్ర పిలుపునిచ్చారు. నర్సీపట్నం కృష్ణాపేలస్ లో శనివారం నర్సీపట్నం నియోజకవర్గంలోని జనసైనికులతో ఉద్యమి కార్యక్రమంపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన సూర్యచంద్ర మ ఆట్లాడుతూ పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోందని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, కార్యకర్తల భాగస్వామ్యాన్ని క్రమబద్ధీకరించేందుకు సరికొత్త సభ్యత్వ విధానాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్టీలో మూడు రకాల సభ్యత్వ వర్గాలను నిర్ణయించిందన్నారు. జనసేన పార్టీ తన శ్రేణులను మూడు విభాగాలుగా విభజించిందని, మొదటి వారిని ఉద్యమిగా పిలుస్తారన్నారు. వీరు పార్టీపై నమ్మకం, అభిమానంతో ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న వారు అయి ఉంటారని చెప్పారు. రెండవ కేటగిరీకి చెందిన వారిని సాధక్ అని పిలుస్తారని, వీరు కేవలం సభ్యులుగానే కాకుండా, పార్టీ సభ్యత్వ నమోదును వేగవంతం చేస్తూ పార్టీ ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లే క్రియాశీలక పాత్ర పోషిస్తారన్నారు. ఇక మూడవ కేటగిరీలోకి ప్రధాతలు వస్తారని, వీరు పార్టీకి వివిధ రూపాల్లో ఆర్థికంగా లేదా మేధోపరంగా అండగా నిలుస్తూ, నాయకత్వ బాధ్యతలు చేపట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని చెప్పారు. సభ్యత్వ నమోదుతో అన్ని వర్గాల వారిని, అన్ని రంగాల వారిని కలుసుకొని పార్టీకి దగ్గర చేసే గొప్ప అవకాశమన్నారు. నియోజకవర్గంలో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. జనసైనికులకు అండగా పార్టీ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రంలో పార్టీ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు ఊడి చక్రవర్తి, జిల్లా సెక్రటరీలు పంచాడ హరినాధ్, అల్లాడ సురేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సలాదుల ప్రసాద్ బాబు, దేవి, చోద్యం పిఎఎఎస్ డైరెక్టర్ రేగుబళ్ల శివ, గొలుగొండ మండల అధ్యక్షులు గండెం దొరబాబు, నాతవరం మండల అధ్యక్షులు వెలగల వెంకటరమణ, నాతవరం మండల ఉపాధ్యక్షులు గుడివాడ అసన్ కుమార్, గొలుగొండ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు బోయిన చిరంజీవి, నాతవరం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు భడ్డు సూరిశేఖర్, నాతవరం మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు జంపా రమణ, ఎస్టీ సెల్ కోనా నారాయణరావు, గుడివాడ కృష్ణ, యర్రంశెట్టి పాపారావు, వర్రే నరసింహ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular