అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నర్సీపట్నం డి.ఎస్.పి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో మహిళా పోలీస్ సిబ్బంది, విద్యార్థినులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. మహిళల భద్రత, సాధికారత, ఆత్మరక్షణ, సమాన హక్కులపై అవగాహన కల్పించేందుకు ఈ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా డి.ఎస్.పి శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, తమ హక్కులను తెలుసుకొని ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.మహిళల భద్రత కోసం ప్రభుత్వం మరియు పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయడం ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. సమాజంలో మహిళలకు గౌరవం, భద్రత కల్పించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ర్యాలీ సందర్భంగా మహిళా శక్తిని ప్రతిబింబించే నినాదాలు, ప్లకార్డులు ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు, డి.ఎస్.పి శ్రీనివాసరావ్ తో పాటు సిఐ గపూర్ రేవతమ్మ మరియు మహిళా సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నర్సీపట్నంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ.
RELATED ARTICLES
