Friday, April 17, 2026
HomeUncategorizedకిర్లంపూడిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ఉత్సాహంగా సాగిన సైకిల్ ర్యాలీ

కిర్లంపూడిలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం: ఉత్సాహంగా సాగిన సైకిల్ ర్యాలీ

కిర్లంపూడి (జిల్లా వాణి ప్రతినిధి)కాకినాడ జిల్లా ​కిర్లంపూడి మండలం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కిర్లంపూడిలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు కలిసి భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. మహిళా సాధికారత, భద్రత మరియు సమాన హక్కులపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద ఈ ర్యాలీని ఎంపీపీ తోట రవి జెండా ఊపి ప్రారంభించారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని, పట్టణంలోని ముఖ్య రహదారుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. మహిళల గౌరవం, రక్షణ మరియు సామాజిక చైతన్యంపై విద్యార్థులు చేసిన నినాదాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ​ఈ సందర్భంగా ఎంపీపీ తోట రవి మరియు వీరవరం సొసైటీ అధ్యక్షులు తోట గాంధీ మాట్లాడుతూ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. “సమాజ అభివృద్ధికి మహిళలే వెన్నెముక అని, వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత” అని వారు పేర్కొన్నారు. మహిళలపై జరిగే అన్యాయాలకు వ్యతిరేకంగా సమాజం ఐక్యంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు. ​ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తూము కుమార్, ఏపీఎం వేదకుమారి, ఎంఈఓలు టి. జోసెఫ్, చిన్నారావు, ఈవోపీఆర్డి సత్యప్రసాద్ మరియు ఇతర విద్యాశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular