Friday, April 17, 2026
HomeUncategorizedకొవ్వూరులో ఏపీవో ఈశ్వరరావు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ పై గ్రామసభ

కొవ్వూరులో ఏపీవో ఈశ్వరరావు ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ పై గ్రామసభ

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజి) సాధారణ తనిఖీల సందర్భంగా గ్రామసభ విజయవంతంగా జరిగింది. ఏపీఓ ఈశ్వరరావు ఆధ్వర్యంలో డిఆర్డీపీఓ రమణబాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.గ్రామసభలో 2024-25 సంవత్సరానికి రోజుగార్ పథకం పనులు, ప్రయోజనాలు, తనిఖీల వివరాలు విస్తృతంగా చర్చించారు. ఏపీఓ ఈశ్వరరావు మాట్లాడుతూ, పథకం ద్వారా గ్రామీణులకు అందుతున్న ఉపాధి అవకాశాలు, పనుల నాణ్యత, లబ్ధదారుల సమస్యల పరిష్కారం గురించి వివరించారు. ముఖ్య అతిథిగా డిఆర్డీపీఓ రమణబాబు మాట్లాడుతూ, పథకం సమర్థవంతంగా అమలు చేయాలంటూ, తనిఖీల ద్వారా పారదర్శకత మరింత పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఎర్రంశెట్టి కాంతమ్మ, పెద్దలు వై.రాజారావు, ఐటీడీపీ మండల అధ్యక్షుడు బంటు రాజు, వీఆర్‌పీ యర్రంశెట్టి లక్ష్మి, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular