జగ్గంపేట, (జిల్లా వాణి ప్రతినిధి) కాకినాడ జిల్లా జగ్గంపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా బి. తిరుపతి రావు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇదే సర్కిల్ పరిధిలోని కిర్లంపూడి, గండేపల్లి పోలీస్ స్టేషన్లలో ఎస్సైగా పనిచేసిన ఆయన, పదోన్నతి పొంది అదే ప్రాంతానికి సీఐగా రావడం విశేషం. జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక భౌగోళిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండటంతో, శాంతిభద్రతల పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సీఐ ధీమా వ్యక్తం చేశారు.

